నాలుగు లింకు రోడ్లకు శ్రీకారం

Telugu Lo Computer
0

 


జంట నగరాల్లో నాలుగు లింకు రోడ్లను మంత్రి కేటీఆర్ సోమవారం ప్రారంభించనున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన రహదారులకు కనెక్టివిటీ పెంచడంతో పాటు మౌలిక సదుపాయాల అభివృద్ధికిగాను జీహెచ్ఎంసీ మిస్సింగ్ లింక్ రోడ్లను చేపట్టింది. ప్రధాన రహదారులపై ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించి, ప్రయాణ దూరాన్ని, సమయాన్ని ఆదా చేసేందుకు అనువుగా నగర వ్యాప్తంగా స్లిప్ రోడ్లు, లింక్ రోడ్లను నిర్మించి అనుసంధానం చేస్తోంది. నగరంలో 126.20 కిలోమీటర్ల విస్తీర్ణంలో 135 లింక్ రోడ్లను నిర్మించాలని ప్రణాళికలు రూపొందించారు. మొదటి దశలో భాగంగా 37 మిస్సింగ్ రోడ్లను రూ. 313 .65 కోట్లతో చేపట్టేందుకు పరిపాలన సంబంధిత అనుమతులను ప్రభుత్వం జారీ చేసింది. రూ. 27.43 కోట్లతో నిర్మించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)