* వడ్డించే వాడు మనవాడైతే కడ బంతిలో కూర్చున్నా ఫరవాలేదు !
* వసుదేవుడంతటివాడు గాడిద కాళ్లు పట్టుకున్నట్లు !
* విదియ నాడు కాకపోతే తదియ నాడైనా కనపడక తప్పదు !
* వంగలేక మంగళవారం అన్నాడంట !
* వండుకునేవాని కి ఒక కూర అడుక్కువానికి అరవైనాలుగు కూరలు !
* వయసొస్తే వంకర కాళ్ళు వాడి అవుతాయి !
* వచ్చీరాని మాటలు రుచీ, ఊరీ ఊరని ఊరగాయ రుచీ !
* వస్తే కొండ పోతే వెంట్రుక !
* వీపు విమానం మోత మోగుతుంది !
* వేపకాయంత వెర్రి !
* వేగం కన్నా ప్ర్రాణం మిన్న !
* వేన్నీళ్ళకి చన్నీళ్ళు తోడు !
* వాడికి సిగ్గు నరమే లేదు !
* విగ్రహపుష్టి నైవేద్యనష్టి !
* వియ్యానికైనా కయ్యానికైనా సమ ఉజ్జీ ఉండాలి !