సామెతలు...!

Telugu Lo Computer
0

 

* సంక్రాంతికి చంకలెత్తలేనంత చలి !

* శంఖులో పోస్తేగాని తీర్థం కాదని !

* శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు !

* శతకోటి లింగాలలో బోడిలింగం ఒకటి !

* శతాపరాధములకు సహస్ర దండనలు !

* శనిపడితే ఏడేళ్ళు – నేను పడితే పధ్నాలుగేళ్ళు !

* శని విరగడయితే చాలు అన్నట్లు !

* శనేశ్వరానికి నిద్రెక్కువ – దరిద్రానికి ఆకలెక్కువ !

* శాపాలకు చచ్చినవాడూ దీవెనలకు బ్రతికినవాడూ లేడు !

* సంఘ భయం – పాప భయం !

* సంగీతానికి గాడిద, హాస్యానికి కోతి అన్నట్టు !

* సంతకు చీటి - లచ్చికి గాజులు !

* సంతకు వెళ్ళొచ్చిన ముఖమా !

* హనుమంతుడి ముందా కుప్పిగంతులు !

* హాస్యగాణ్ణి తేలుకుట్టినట్లు !

Post a Comment

0Comments

Post a Comment (0)