* చిత్తశుద్ది లేని శివపూజలేల !
* చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి !
* చెముడా అంటే మొగుడా అన్నట్టు !
* చెవిలో జోరీగలా !
* చేతకాక మంగళవారమన్నాడంట !
* చేత కానమ్మకి చేష్టలెక్కువ !
* జగమెరిగిన బ్రాహ్మణునికి జంధ్యమేల !
* జరిగినమ్మ జల్లెడతోనైనా నీళ్ళు తెస్తుంది !
* జన్మకో శివరాత్రి అన్నట్లు !
* జోగి జోగి రాసుకుంటే బూడిద రాలినట్లు !
* జోడు లేని బ్రతుకు తాడులేని బొంగరం !
* చెరపకురా చెడేవు !
* చాప క్రింది నీరులా !
* చారలపాపడికి దూదంటి కుచ్చు !
* చెట్టుపేరు చెప్పుకుని కాయలు అమ్మడం !