ఆన్ లైన్లో ఆనందయ్య మందు!

Telugu Lo Computer
0


ఆనంద‌య్య ఔషధానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో పంపిణీ విధానంపై నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలో అధికారులు సమావేశం నిర్వహించారు. కరోనా నిబంధనలను పాటిస్తూ ప్రభుత్వ సూచనల  ప్రకారం మందు  పంపిణీ చేయాలని సమావేశంలో నిర్ణయించారు. 

వికేంద్రేకరణ, ఆన్ లైన్ లో ఔషధాన్ని పంపిణీ చేయడానికి అధికార యంత్రాంగం చర్యలు చేపడుతుంది. 

మందు కోసం జనాలు భారీగా క్యూ కట్టడం వల్ల.. వారిలో ఎవరికైనా కరోనా ఉంటే.. వెంటనే ఎక్కువ మందికి వ్యాపించే అవకాశం ఉంది.అంతేకాకుండా.. ప్రోటోకాల్ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. అందుకే.. ప్రభుత్వం ఈ మందు పంపిణీ విషయంలో తాజాగా ఓ నిర్ణయం తీసుకుంది. ఆన్ లైన్ లో ఈ మందు పంపిణీ చేసేలా ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీని కోసం ప్రత్యేకంగా ఓ మొబైల్ యాప్ ని కూడా రూపొందిస్తుండటం విశేషం.  

మందు త‌యారీపై వ‌న మూలిక‌లు, ముడి ప‌దార్థాలు సేక‌రిస్తూనే… మందు పంపిణీపై ఆనంద‌య్య కార్యాచ‌ర‌ణ ఆలోచిస్తున్నారు. మందు పంపిణీ ప్రారంభానికి చేయ‌టం మ‌రో నాలుగైదు రోజులు ప‌ట్టే అవ‌కాశం ఉంది. 

మందు కోసం ఎవ‌రూ నెల్లూరు రావ‌ద్ద‌ని, అవ‌స‌రం అయితే మొబైల్ యాప్ ద్వారా… ఆనంద‌య్య మందును డోర్ డెలివ‌రీ చేసేందుకు ఆలోచిస్తున్న‌ట్లు క‌లెక్ట‌ర్ తెలిపారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)