అమెరికాలో టీకాలు వృధా అవుతాయా?

Telugu Lo Computer
0


మనలాంటి దేశాలలో వ్యాక్సిన్లు దొరక్క నానా ఇబ్బంది పడుతుంటే అమెరికాలో పరిస్థితి భిన్నంగా ఉంది. అమెరికాలో వ్యాక్సినేషన్కి అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు అనేక "ఎర్ర"లు వేసినా అక్కడి ప్రజలు అంత ఆశక్తి చూపక పోవడంతో  టీకాల గడువు  ముగిసే ప్రమాదం పొంచి ఉంది.

ఇప్పటివరకు సగం జనాభా టీకాలు వేసుకున్నా, మిగతా వారు అంతగా ఆసక్తి చూపకపోవడంతో టీకాల గడువు  ముగిసే ప్రమాదం పొంచి ఉంది. దీంతో లక్షలాది డోసులు వృథా అయ్యే అవకాశం ఉందని అధికారులు భయపడుతున్నారు. టెన్నెసీ, నార్త్‌ కరోలినాలు ఇప్పటికే మిలియన్ల కొద్దీ డోసులను ఫెడరల్‌ ప్రభుత్వానికి తిరిగి పంపించాయి. కొత్త వ్యాక్సిన్లకు ఒక్లహామా ఆర్డరే పెట్టడం లేదు. ఇప్పటికే ఆ రాష్ట్రం దగ్గర ఏడు లక్షలపైగా డోసులు నిల్వ ఉన్నాయి. అయితే రోజుకు 4,500 మందే అక్కడ వ్యాక్సిన్‌ వేసుకుంటున్నారు. మోడెర్నా, ఫైజర్‌కు సంబంధించిన 27 వేల టీకాల గడువు ఈ నెలాఖరుకల్లా ముగియనుంది. జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ టీకాల పరిస్థితీ అంతే. ఈ టీకాల గడువు తేదీని ఆరు వారాలకు ప్రభుత్వం పొడిగించింది. అయినా అప్పట్లోకి వాటి వినియోగం కష్టమేనని అధికారులు చెబుతున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)