కూల్ డ్రింక్స్ చేసే కీడు !

Telugu Lo Computer
0

 

కూల్ డ్రింక్ లో కలిపే 10చెంచాల పంచదార వంటి పదార్థాల వలన వాంతులు వచ్చే అవకాశం ఉన్నందున, వాంతులు నివారించేందుకు ఫాస్ఫోరిక్ యాసిడ్, కలుపుతారు. కూల్ డ్రింక్ లో ఉన్న షుగర్ ను లివర్ రక్తం లోకి పంపడం వలన ఒక్కసారిగా రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరిగి,అధికంగా ఏర్పడిన గ్లూకోజ్, కొవ్వుగా రూపాంతరం చెంది,బరువు పెరగటానికి దోహదపడుతుంది. కూల్ డ్రింక్ లో  మరో హానికల్గించే పదార్థం కెఫిన్, కెఫిన్ అధికమైతే,బి.పి. పెరగటానికి కారణంగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కూల్ డ్రింక్ తాగిన 45 నిమిషాలకు,మన శరీరంలో డోఫమైన్ అనే రసాయనం ఉత్పత్తి అవుతుంది. ఇది మనకు హానికల్గించే డ్రగ్ లా పనిచేస్తుంది. పాస్ఫోరిక్ ఆమ్లం చిన్న ప్రేగులోకి చేరి,కాల్షియం,మెగ్నీషియం, జింక్ వంటి లవణాలకు అడ్డుపడటం వలన,మూత్ర విసర్జన అధికమై ,డీ హైడ్రేట్ అవటం వలన దాహం పెరగటానికి కారణమౌతుంది.ఇన్ని నష్టాలను కల్గించే కూల్ డ్రింక్స్ సేవించి, బహుళజాతి కంపెనీలకు, లాభాలను పెంచడం అవుసరమా?

إرسال تعليق

0تعليقات

إرسال تعليق (0)