టీ ష‌ర్ట్, జీన్స్ వేసుకోవ‌ద్దు!

Telugu Lo Computer
0

 


గ‌త‌వారం సీబీఐ (సెంట్ర‌ల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేష్) నియ‌మితులైన సుబోధ్ కుమార్ జైస్వాల్ ప‌రిపాల‌నా విభాగంలో కొన్ని మార్పుల‌కు పూనుకున్నారు.  ఇక నుండి  అధికారులు, ఇత‌ర సిబ్బంది అంద‌రూ కూడా ఫార్మ‌ల్ డ్రెస్సులే వేసుకుని రావాల‌ని, జీన్స్ టీష‌ర్ట్స్‌, స్పోర్ట్స్ షూలు వేసుకోకూడ‌ద‌ని స్ప‌ష్టం చేశారు. ఈ ఆదేశాల ప్ర‌కారం సీబీఐలో ప‌ని చేసే పురుషులు ష‌ర్ట్స్‌, ఫార్మ‌ల్ ప్యాంట్లు, ఫార్మ‌ల్ షూస్ వేసుకోవాలి. ప్ర‌తి రోజూ  షేవ్ చేసుకోవాల్సిందే. ఇక మ‌హిళా అధికారులు కూడా చీర‌లు, సాధార‌ణ చొక్కాలు, సూటు, బూట్లు వేసుకుని మాత్ర‌మే రావాలి. దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని సీబీఐ కార్యాల‌యాలు, శాఖ‌ల‌కు ఈ నిబంధ‌న‌లు వ‌ర్తిస్తాయి.  

గ‌త వార‌మే సీబీఐ 33వ డైరెక్ట‌ర్‌గా నియ‌మితుల‌య్యారు. ప్ర‌ధాని మోదీ, సీజేఐ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌, లోక్‌స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నేత అధీర్ రంజ‌న్ చౌధ‌రితో కూడిన క‌మిటీ సుభోధ్‌కుమార్‌ను ఈప‌దవికి ఎంపిక చేసింది. 1985 మ‌హారాష్ట్ర క్యాడ‌ర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి సుబోధ్‌కుమార్ రెండేళ్ల పాటు ఈ ప‌దవిలో ఉంటారు. రానున్న రోజుల్లో సీబీఐ ప‌నితీరును మెరుగుప‌రిచేందుకు సుబోధ్ కొన్ని కీల‌క చ‌ర్య‌లు తీసుకోనున్న‌ట్లు సీబీఐ వ‌ర్గాలు తెలిపాయి. 

Post a Comment

0Comments

Post a Comment (0)