భారీగా పడిపోయిన కరోనా కేసులు

Telugu Lo Computer
0

 


తెలంగాణ ప్రభుత్వం కరోనా  బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 993 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,21, 606 కి చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 13,869 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక రాష్ట్రంలో కరోనాతో 9 మంది మృతి చెందారు.దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 3,644 కి చేరింది. కరోనా బులెటిన్ ప్రకారం నిన్న ఒక్కరోజు రాష్ట్రంలో 1417 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇక గడిచిన 24 గంటల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 124 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. నల్గొండలో 78, సూర్కాపేటలో 72, మంచిర్యాలలో 59, భద్రాద్రి కొత్తగూడెంలో 58, ఖమ్మంలో 50, మహబూబాబాద్‌లో 51 కేసులు నమోదయ్యాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)