పిల్లలపై సీరం ట్రయల్స్ ?

Telugu Lo Computer
0


దేశంలో కరోనా వైరస్ వ్యాక్సిన్ నోవావాక్స్ క్లినికల్ ట్రయల్స్ పూర్తయ్యే దశలో ఉన్నాయని ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు సీరం సీఈవో అదార్ పూనావల్లా తెలిపారు. పిల్లలపై వ్యాక్సిన్ ట్రయల్స్ ప్రారంభించాలని  యోచిస్తున్నట్టు కూడా వెల్లడించారు. నోవావాక్స్ టీకా ఒక మాదిరి నుంచి త్రీవమైన వైరస్ బాధితుల్లో 100 శాతం రక్షణనిస్తోందని సగటున నోవావాక్స్ వ్యాక్సిన్ 90 శాతం సమర్ధవంతమైందని పూనావల్లా వెల్లడించారు. అయితే గ్లోబల్ ట్రయల్స్ డేటా ఆధారంగా తాము లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందన్నారు. నవంబర్ నాటికి ఇది అందుబాటులోకి రానుందని భావిస్తున్నామన్నారు. రెగ్యులేటరీ ఆమోదం పొందితే కంపెనీ సెప్టెంబరు నాటికి నోవావాక్స్ ఉత్పత్తిని ప్రారంభిస్తుందని చెప్పారు. అలాగే పిల్లలకు టీకా అందుబాటులోకి తీసుకొచ్చే క్రమంలో నోవావాక్స్ క్లినికల్ ట్రయల్స్ ను జూలైలో ప్రారంభించాలని యోచిస్తున్నామనీ దీనిపై త్వరలోనే డ్రగ్ రెగ్యులేటరీ అనుమతిని కోరనున్నామని తెలిపారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)