సామెతలు...!!

Telugu Lo Computer
0

 

* ఋణము – వ్రణము ఒక్కటే !

* ఎంగిలిచేత్తో కాకిని తోలని వాడు  !

* ఎంగిలాకులు ఎత్తమంటే లెక్క పెట్టినట్లు  !

* ఎంగిలికి ఎగ్గు లేదు – తాగుబోతుకు సిగ్గు లేదు  !

* ఎంచపోతే మంచమంతా కంతలే  !

* ఏ ఆకు రాలినా ఈతాకు రాలదు  !

* ఏ ఎండకా గొడుగు!

* ఏకులా వచ్చి మేకులా తయారయ్యాడు !

* ఒక దెబ్బకు రెండు పిట్టలు  !

* ఒడిలో బిడ్డను పెట్టుకొని ఊరంతా వెతికినట్టు  !

* ఓడ దాటే దాక ఓడమల్లయ్య, ఓడ దాటిన తరువాత బోడి మల్లయ్య  !

* ఓడలు బళ్ళు అవుతాయి బళ్ళు ఓడలవుతాయి  !

* కంచానికి ఒక్కడు – మంచానికి ఇద్దరు  !

* కంచి లో చేయబోయే దొంగతనానికి కాళహస్తి నుంచే వంగి నడిచినట్లు  !

* కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా?  !

Post a Comment

0Comments

Post a Comment (0)