లక్ కోసం చెమటోడుస్తున్న ప్రిన్స్

Telugu Lo Computer
0



‘బస్‌స్టాప్‌’, ‘రొమాన్స్‌’ వంటి చిత్రాలతో లవర్‌ బాయ్‌గా గుర్తింపు తెచ్చుకున్నప్రిన్స్‌  ప్రస్తుతం ఆయన లవర్‌బాయ్‌ లుక్‌ నుంచి కండల వీరుడిగా మారారు. సినిమాల్లో అవకాశాలు పొందేందుకు జిమ్‌లో చెమటోడుస్తున్నారు. ఇటీవల తన న్యూలుక్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలను ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేసిన ప్రిన్స్‌.. అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఈ క్రమంలో ఆయన జిమ్‌ వర్కౌట్లకు సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోలు నెట్టింట్లో  తెగ చక్కర్లు కొడుతున్నాయి.  అమాయకపు లుక్స్‌తో మొదటిసారి వెండితెరపై మెరిసిన ఈ హీరోకి  హీరోగా మాత్రం అనుకున్న విజయం వరించలేదు. దీంతో ప్రిన్స్‌ పలు చిత్రాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా కూడా మెప్పించారు.

Tags

Post a Comment

0Comments

Post a Comment (0)