తిట్టు కవిత్వం

Telugu Lo Computer
0


ఒక సారి రాయల ఆస్థానానికి ప్రెగడరాజు నరసరాజు అనే కవి వస్తాడు. తానూ గొప్ప పండితుదానని గొప్పలు చెప్పుకుంటాడు. తానూ ఎటువంటి వారి కవిత్వము లోనైనా తప్పుల్ని  చూపించ గలనంటాడు. రామకృష్ణుడు ఒక పద్యము చెప్తాడు. అందులో వత్తులు వుండవలిసిన చోట వత్తులు వుండేట్టు లేని చోట్ల వుండేటట్టు వుంటుంది ఆ పద్యము. నరసరాజు 'ద' వుండవలిసిన చోట 'ధ' అని వుండాలని 'భ' వుండవలిసిన చోట 'బ' అన్నావని తప్పుల్ని ఎత్తి చూపుతాడు. రామకృష్ణుడు అది ఎలా తప్పు కాదో అర్థము సవివరణముగా  చెప్పి అతని నోరు మూయిస్తాడు. నరసరాజును తిడుతూ పద్యాలు చెప్తాడు. 

   తెలియని వన్ని తప్పులని దిట్టతనాన సభాంతరంబునన్ 

    పలుకగ రాకు రోయి పలుమారు పిశాచపు పాడెకట్ట నీ 

పలికిన నోట దుమ్ము వడ భావ్య మెరుంగవు పెద్దలైన వారి న్ని 

టుల  నిరసింతురాప్రెగడ రాన్నరసా విరసా తుసా బుసా    

ఒకని కవిత్వమందె నయు తప్పులు నొప్పులు నా కవిత్వ మం

దొకనికి తప్పు బట్ట పనియుండదు కాదని తప్పుబట్టినన్ 

మొక మటు కిందుగాదివిచి ముక్కలువోవ నినుంప కత్తి తో 

సిక మొదలంట గోయుదు  చెప్పున గొట్టుదు మోము దన్నుదున్   

కుక్కలు బొమికలు వెదకును 

తక్కగ నూర  పంది  యగడిత (బురదగుంట) వెదకున్ 

నక్కలు బోరియలు వెదుకును 

తక్కిడి నా ముండ కొడుకు తప్పే వెదకున్ 

  (దీనిని తిట్టు కవిత్వమని అంటారు ) నరసరాజు మారు మాటాడకుండా రాజ్యము విడిచి వెళ్ళిపోయాడు.

إرسال تعليق

0تعليقات

إرسال تعليق (0)