వెంటిలేషనే శరణ్యం !

Telugu Lo Computer
0

 

దగ్గడం, తుమ్మడం, శ్వాస తీసుకోవడం, మాట్లాడడం, పాటలు పాడడం చేస్తున్నప్పుడు కరోనా సోకినా వ్యక్తి గొంతు, ముక్కు నుండి వైరస్ కణాలు బయటకు విడుదలవుతాయి. అందులోని పెద్ద, పెద్ద కణాలు క్రింద పడి భూ ఉపరితలంపై చేరుకుంటాయి. వాటిలోని కంటికి కనిపించని   చిన్న చిన్న ఏరోసెల్స్ కణాలు గాలిలో ఉండిపోతాయి. ఈ ఏరోసెల్స్ కణాలు ఉష్ణోగ్రత, తేమ, గాలి వేగాన్ని బట్టి ప్రయాణిస్తుంటాయి. గాలిలో ఎక్కువసేపు ఉండటంతో పాటు గదుల్లో తొందరగా వ్యాపిస్తుంటాయి. ఇవే ప్రమాదకరంగా మారుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.  భవనాలలో వెంటిలేషన్ పెంచుకోవడం ద్వారా  ఈ ప్రమాదాన్ని నివారించవచ్చునని  శాస్త్రవేత్తలు  అంటున్నారు. ఇండోర్లో పని చేసేవారు ఎక్కువగా వైరస్ బారిన పడుతున్నారు. 

ఆస్ట్రేలియాలోని క్వీన్ ల్యాండ్ విశ్వ విద్యాలయం ప్రొపెసర్ లిదియా మొరావ్ స్కా సారధ్యంలో 14 దేశాలకు చెందిన 39 మంది శాస్త్రవేత్తలు సుదీర్ఘ అధ్యయనం చేసి తమ పరిశోధనలను వెల్లడించారు. ఇండోర్ వెంటిలేషన్ మెరుగుపర్చడం వలన అంటువ్యాధుల వ్యాప్తిని నివారించఫచ్చని అభిప్రాయపడ్డారు. దేనికోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ నూతన మార్గదర్శికాలను, భవనాలకు ప్రమాణాలను రూపొందించాలని కోరుతున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)