కంచి గరుడ సేవ

Telugu Lo Computer
0

 

పూర్వపు రోజుల్లో జమీందారుల దగ్గర సంవత్సరాల తరబడి వెట్టి చాకిరీ చేసి విశ్వాసంగా
పడి వున్నాచేసిన పనికి ఫలితము వుండేది కాదు.ఎంత శ్రమించినా చివరికి శ్రమంతా నిష్ప్రయోజన మైన సందర్భం లో ఈ మాటను వాడుతూ వుంటారు.కష్టానికి తగిన కూలీ
గానీ జీతంగానీ రానప్పుడు "ఎందుకురా నీకు ఆ కంచి గరుడ సేవ"అంటూ వుండేవారని
తెలుస్తూంది.ఇంతకీ ఆ ఏమిటా కంచి గరుడ సేవ?
మహా పుణ్యక్షేత్రమైన కంచి లో అతి పెద్దదైన గరుడ విగ్రహముంది.ఒక బ్రాహ్మణుడు
ప్రతిరోజూ నియమం తప్పకుండా ఆ విగ్రహాన్ని అభిషేకించి పూజిస్తూ వుండేవాడు.భక్తులు అక్కడికి వచ్చి పూజ చేయించుకొని దక్షిణ యిచ్చేవారు కాదు. అందువల్ల గంపెడు సంతానం తో దరిద్రం అనుభవిస్తూ వుండేవాడు.పక్కన
వున్న దేవతా విగ్రహాల దగ్గర సేవ చేసే వాళ్లకు మాత్రం భక్తుల కానుకలు,దక్షిణలు కుప్పలు తిప్పలుగా వస్తూ వుండేవి.ఇంట్లో వాళ్ళూ,బంధువులూ ఫలితం యివ్వని ఆ కంచిగరుడసేవ నీ కెందుకురా అని అంటూ వున్నాలెక్కపెట్టక నిత్యం పూజచేస్తూ ఆ సేవలోనే కన్నుమూశాడు.ఆ పుణ్యమూర్తి గతించినా ఈ జాతీయం తో యెల్లప్పుడూ
జీవించి వుండే అదృష్టాన్ని పొందాడు.నిస్వార్థ సేవ లోని ఫలితాన్ని ఆజరామరణ
మైన శాశ్వత కీర్తిని అందిస్తుందని ఋషి వాక్యం.
అందుకే సుమతి శతక కర్త యిలా అన్నాడు.
అడిగిన జీతంబియ్యని
మిడిమేలపు దొరను గొల్చి మిడుకుట కంటెన్
వడిగల యెద్దుల గట్టుక
మడి దున్నుక బ్రతుక వచ్చు మహిలో సుమతీ!

తగినంత జీతమివ్వకుండా పనిచేయించుకునే యజమానిని దగ్గర పని చేయుట
కంటేమంచి వేగము గల ఎద్దులను గట్టుకొని పొలము దున్నుకొని బ్రతకడము మేలు.
పనిచేయించుకొని సరియైన జీతము యివ్వాలి.అలా ఇస్తున్నావు కదా!అని
నారదుడు ధర్మరాజుని ఒక సందర్భంలో అడిగాడు. ఇవ్వకపోతే అనర్థం జరుగుతుంది అని చెబుతాడు.ఇదేమాట శ్రీరాముడు భరతుడిని కూడా ఒక సందర్భంలో అడుగుతాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)