బుద్ధం శరణం గచ్ఛామి !

Telugu Lo Computer
0

 

మాయాదేవి పురిటికి పుట్టింటికి  వెళ్తూ మధ్యలో అందమైన ప్రకృతిని చూసి పరవశురాలై రధం దిగి తోటలో అడుగులు వేస్తూ విరగకాసిన మామిడి కొమ్మను పట్టుకొని అక్కడే సిద్ధార్ధునికి జన్మనిచ్చిందట!

అంత సున్నితమైన మనసు ఆ బిడ్డది. ఎవరో హంసకి బాణం వేస్తే  దాన్ని రక్షించి దాని విడుదల కొరకు పోరాడాడు. 

అదే తత్వంతో దుఃఖాలకు కష్టాలకు కారణం కనుగొనడానికి సర్వ సంగ పరిత్యాగియై అర్ధరాత్రి భార్య బిడ్డను, తల్లిదండ్రులను,  రాజ్యాన్ని త్యజించి అడవులకు పోయి తపస్సు చేశాడు.

అశ్వద్ధవృక్షంక్రింద ఆయనకు సత్యదర్శనమయింది.

దుఃఖాలకు కారణం కోరికలను అదుపు చెయ్యలేక పోవడం, మితిమీరిన దురాశ అని వాటిని  వదులుకోండని అందరికి భోధించాడు. 

     అశోకుడు, బింబిసారుడు లాంటి కరడుగట్టిన సామ్రాజ్యవాద చక్రవర్తులను  మార్చాడు.


బుద్ధం శరణం గచ్ఛామి !

సంఘం శరణం గచ్ఛామి !


Post a Comment

0Comments

Post a Comment (0)