రోజంతా హుషారుగా.. ....

Telugu Lo Computer
0

 


చాలా మంది ఉదయం నిద్రలేవగానే మొబైల్‌ ఆపరేటింగ్‌ చేస్తుంటారు. సోషల్‌ మీడియాలో ఏం పోస్టులు వచ్చాయో చూసుకుంటారు. ఆ తర్వాత కొందరు యథావిధిగా తమ కార్యకలాపాలను ప్రారంభిస్తారు. ఉదయం నిద్రలేవగానే ఫోన్లకు, ఇతర ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్లకు దూరంగా ఉండాలంటున్నారు వైద్య  నిపుణులు. ఇవి మన మూడ్‌ను చెడగొడతాయి  అందుకే ఉదయం వాటిని చూడకూడదు.

నిద్రలేవగానే ఏదైనా ఒక జోక్‌ చదవండి. తర్వాత మీ ముఖాన్ని అద్దంలో 20 సెకన్ల పాటు చూసుకొని నవ్వండి. నిద్రలేవగానే వెంటనే ఇంట్లో అందరికీ, కుదిరితో పక్కనున్న వారికి గుడ్‌మార్నింగ్‌ చెప్పండి. ఇది మీ మూడ్‌ను ఉత్సాహంగా ఉంచేలా చేస్తుంది. నిద్రలేవగానే కొన్ని నిమిషాల పాటు నిశ్శబ్దంగా కళ్లు మూసుకుని కూర్చోని, ఊపిరి బాగా లోపలికి పీల్చుకుని వదిలితే ఈ అలవాటు శ్వాసక్రియ మీ మూడ్‌ను ఉత్సాహంగా ఉంచుతుంది.


రిలాక్సేషన్‌ కోసం నిద్రలేవగానే చాలా మంది టీ లేదా కాఫీ తాగుతారు. వీటికన్నా నిమ్మకాయ నీళ్లు లేదా మంచినీళ్లు తాగితే ఎంతో మంచిది . దీంతో శరీరంలో ఉండే వ్యర్థాలన్నీ  బయటకుపోయి శరీరం శుద్ది అవుతుంది.


పండ్లలో ఉండే న్యూట్రీషిన్స్‌, ప్రోటీన్స్‌ వ్యాధి నిరోధకశక్తిని పెంచి శరీరాన్ని శక్తివంతంగా ఉంచుతుంది. ముఖ్యంగా పండ్లను ఉదయం తీసుకుంటే ఆ రోజంతా మీరు  హుషారుగా ఉంటారు 


ప్రతి రోజు నిద్రలేచే సమయం కన్నా మరో గంట ముందుగా నిద్రలేచే అలవాటు చేసుకోండి. ఉదయాన్నే మేల్కొవడం వల్ల ఆరోగ్యానికి ఒక మంచి అలవాటు అలవడడమే కాకుండా ఆరోగ్యంగా ఉండేందుకు ఎంతగానో  ఉపయోగపడుతుంది.


నిద్రలేచిన తర్వాత వ్యాయమం చేయడం మీ అలవాట్లలో లేకపోయినట్లయితే ఆ అలవాటు చేసుకోండి. రోజు హాయిగా ఉండడానికి ఉదయం పూట మీకు నచ్చిన సంగీతాన్ని వినండి. సంగీతం మనలో చైతన్యం పెంచుతుంది. అంతేకాకుండా మన మూడ్‌ రొటీన్‌గా ఉండకుండా సంగీతం సాయం చేస్తుంది. అలా ప్రతి రోజు నిద్రలేవనగా ఇలాంటివి చేస్తే హుషారుగా ఉండడమే కాకుండా ఆరోగ్యంగా ఉంటారు

Post a Comment

0Comments

Post a Comment (0)