యాహూలోనే సెర్చ్
October 12, 2013
0
ప్రముఖ సెర్చ్ ఇంజన్ యాహూలో మీరు ఏదైన సబ్జెక్ట్‌ను సెర్చ్‌చేస్తే, దానికి సంబంధించిన సమాచారం లభ్యం కాకపోతే, వేరే సెర్చ్ ఇంజన్ ద్వారా ఆ సబ్జెక్ట్‌ను టైప్ చేసి వెతుకుతాము. కానీ, ఆ అవసరం లేకుండానే యాహూలోనే సెర్చ్ ద్వారా కావలిసిన సమాచారాన్ని పొందవచ్చునని యాహూ వెల్లడిస్తోంది. అది ఎలాగ అనగా..యాహూ సెర్చ్ బాక్స్‌లో కొత్త టూల్‌ను ప్రవేశపెట్టినట్లు సంస్థ పేర్కొంది. దీని సాయంతో కావలసిన సమాచారాన్ని టైప్ చేస్తే చాలు. ఆ సమాచారానికి సంబంధించిన సమస్త సమాచారాన్ని యాహూ మీ ముందు ఉంచుతుందని సంస్థ అంటోంది. దీని గురించి మరింత సమాచారాన్ని కావాలంటే యాహూ సెర్చ్ బాక్స్ ఓపెన్ చేయాల్సిందే మరి..!