ఆపిల్‌ కంప్యూటర్‌

Telugu Lo Computer
0


ఆపిల్‌ మ్యాకింతోష్‌! ఈ మాట వినగానే కంప్యూటర్‌ ప్రియులకు మహదనాందమౌతుంది.ఈ కంప్యూటర్‌కు అలవాటుపడిన వారు ఇతర కంప్యూటర్లను వాడటానికి అంత సుముఖత చూపలేరు! ఆ సంస్థ నుండి వచ్చే ఉత్పత్తులు అలాంటివి మరి! కంప్యూటర్‌కు మౌస్‌ వినియోగాన్ని పరిచయం చేసి ఆపరేటింగ్‌ను సులువుచేసింది ఆపిలే! జియుఐ (గ్రాఫిక్‌ యూజర్‌ ఇంటర్‌ఫేస్‌) ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను, పీర్‌ టు పీర్‌ నెట్‌వర్కింగ్‌, పిడిఎ (పర్సనల్‌ డిజిటల్‌ అసిస్టెంట్‌) తొలిసారిగా అందించిన ఘనత ఆపిల్‌దే.
ఐబిఎంను పోలిన పర్సనల్‌ కంప్యూటర్‌ను, దానిపై పనిచేసే సాఫ్ట్‌వేర్‌లు, ఇతర ఉత్పత్తులను తయారు చేయడానికి ఉత్సాహంతో రంగంలోకి దిగిన ఈ సంస్థకు వేరే ప్లాట్‌ఫారమ్‌ కనుగొన్న ఘనత దక్కింది. థింక్‌ డిఫరెన్స్‌ స్లోగన్‌తో ప్రపంచ కంప్యూటర్‌ చరిత్రలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. అత్యాధునిక యుగంలో కూడా ఐమ్యాక్‌, ఐఫోన్‌, ఐపాడ్‌ లాంటి ప్రొడక్ట్‌లతో జనాదరణ పొందుతుంది.
1975లో కార్ల గ్యారేజిలో ఇద్దరు యువ యుజనీర్లు తమకు తట్టిన ఆలోచనతో పని ప్రారంభించారు. అదే సంవత్సరంలో మౌంటెన్‌వ్యూలోని బైట్‌ అనే పేరుగల షాప్‌ నుండి అసెంబుల్డ్‌ చేసిన 50 కంప్యూటర్లు సరఫరా చేయమని వారి ఆర్డరు వచ్చింది. దానితో 1976 ఏప్రిల్‌లో యాపిల్‌ కంప్యూటర్స్‌ అనే సంస్థను ప్రారంభించి తమ కార్యకలాపాలు ఆరంభించారు. జాబ్స్‌ అనే ఇంజనీర్‌ తనకిష్టమైన ఆపిల్‌ పండు పేరును తమ కంపెనీకి పెట్టడం జరిగింది. లోగోలు బైట్‌ను కూడా సూచించడానికి కొరికిన (ఇంగ్లీషులో బైట్‌ అంటే కొరకడం) ఆపిల్‌ని ఉపయోగించడం జరిగింది. అదే సంవత్సరం సింగిల్‌ బోర్డును, ఆన్‌బోర్డు రోమ్‌, వీడియో ఇంటర్‌ఫేస్‌ (టివిని మోనిటర్‌ ద్వారా కనెక్ట్‌ చేయడానికి), ఎక్స్‌టర్నల్‌ ప్రోగ్రామింగ్‌ ఇంటర్‌ఫేస్‌తో ఆపిల్‌ × అనే కంప్యూర్‌ను విడుదలైంది. దాని తర్వాత 1977లో ఆపిల్‌ ×× పేరుతో మార్కెట్లోకి వచ్చిన కంప్యూటర్‌ అత్యధికంగా అమ్ముడై పర్సనల్‌ కంప్యూటర్ల చరిత్రలో రికార్డును సృష్టించింది. ఆపిల్‌ ×× కంప్యూటర్‌పై 16 వేల అప్లికేషన్‌ ప్రోగ్రామ్‌లు తయ్యారయంటే దాని క్రేజ్‌ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. 1980లో ఆపిల్‌ ×× విడుదల చేసింది. 1998-2001 కాలంలో ఐమ్యాక్‌, ఐఫోన్‌, పవర్‌మ్యాక్‌ జి 4 లాంటి ఉత్పత్తులను విడుదల చేసి తన స్థానాన్ని మార్కెట్‌లో సుస్థిరం చేసుకుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)