మౌస్‌

Telugu Lo Computer
0




మౌస్‌ వాడుకలోకి వచ్చిన తరువాత కంప్యూటర్‌ ఆపరేటింగ్‌ అనేది చాలా సులువైంది. అంతక్రితం కమాండ్స్‌ను గుర్తుంచుకొని డాస్‌ ఫ్రాంట్‌లో కంప్యూటర్‌ను ఆపరేట్‌ చేయవలసి వచ్చేది. అందువలన పరిజ్ఞానం వున్నవారే దానిని ఆపరేట్‌ చేయగలిగేవారు. మౌస్‌ వచ్చిన తరువాత దాని ఆధారంగా కంప్యూటర్‌ను ఆపరేట్‌ చేయడం చాలా సులువైంది. మౌస్‌ల్లో బాల్‌ మౌస్‌, ఆప్టికల్‌ మౌస్‌, వైర్‌లెస్‌ మౌస్‌లున్నాయి. ప్రస్తుతం ఆప్టికల్‌ మౌస్‌లు విరివిగా వాడకంలో వున్నది.
బాల్‌ మౌస్
ఈ రకం మౌస్‌ క్రింది భాగంలో ఒక బాల్‌ వుంటుంది. ఇది పూర్తిగా రబ్బరుతోగానీ లేదా ఏదైనా లోహానికి రబ్బరు చుట్టబడిగానీ వుంటుంది. మౌస్‌ కదలికలకు అనుగుణంగా బాల్‌ తిరుగుతూ పనిచేస్తుంది. ఈ మౌస్‌లో బాల్‌కు ఇరువైపులా రెండు రోలర్‌లుంటాయి. ఈ రోలర్‌లు లంబకోణంలో వుండి బాల్‌ను కదిపినప్పుడు రోలర్లు కూడా కదలికలకు అనుగుణంగా తిరుగుతూ వుంటాయి. ఈ రోలర్లలో ఒకటి వర్టికల్‌ (పై నుండి కిందికి, కింది నుండి పైకి) రెండవది హార్జింటల్‌ (ఎడమ నుండి కుడికి, కుడి నుండి ఎడమకు) మూమెంట్స్‌కు ఉపయోగపడతాయి. ఈ రోలర్లకి ఎన్‌కోడర్స్‌ అనే చిన్న చక్రాలు కలపబడి వుంటాయి. రోలర్లు కదిలినప్పుడల్లా వీటితోపాటు ఎన్‌కోడర్స్‌ కూడా తిరుగుతూ వుంటాయి. ఆ చక్రం తిరిగినప్పుడల్లా ఈ కాంటాక్ట్‌ పాయింట్స్‌ ప్రక్కనే అమర్చబడిన ఎలక్ట్రికల్‌ కాంటాక్ట్‌ బార్‌లను తాకుతాయి. అలా పాయింట్స్‌ బార్‌ను తాకినప్పుడల్లా ఎలక్ట్రికల్‌ సిగల్స్‌ పుడుతూ వుంటాయి. అలా పుట్టిన సిగల్స్‌ కంప్యూటర్‌కు కనెక్ట్‌ చేసిన మౌస్‌ కేబుల్‌ ద్వారా కంప్యూటర్‌కు చేరతాయి. సిగల్స్‌ ఎన్నిసార్లు జనరేట్‌ అయ్యాయి, ఏ రోలర్‌ నుండి ఉత్పన్నమైయ్యాయి అనే అంశాలను కంప్యూటర్‌లో ఇన్‌స్టాల్‌ చేయబడిన మౌస్‌ డ్రైవర్స్‌ సాఫ్ట్‌వేర్‌ను ఆకళింపు చేసుకొని మౌస్‌ కర్సర్‌ని ఏ దిశగా, ఎంత దూరం కదపాలో నిర్ణయిస్తుంది.
బాల్‌ మౌస్‌లు నున్నగా వున్న ప్రదేశంలో మాత్రమే ఉపయోగించగలము. ఎగుడు దిగుడు వున్న ప్రదేశాలలో ఇవి సరిగ్గా పనిచేయవు. అందుకని వీటి వాడకానికి తప్పనిసరిగా మౌస్‌ ప్యాడ్‌లను వాడవలసి వుంటుంది. ప్యాడ్‌ను ఎప్పుడూ పరిశుభ్రంగా వుంచుకోవాలి. ఎటువంటి దుమ్మూ, దుళ్లి వున్నా మౌస్‌ సరిగ్గా పనిచేయదు. మౌస్‌లో వున్న బాల్‌కు పట్టిన డస్ట్‌ను శుభ్రం చేసుకోవాలి. ఇది మెకానికల్‌ మౌస్‌ కాబట్టి దానిలో వున్న రోలర్స్‌, వీల్స్‌, బాల్‌ కాలక్రమేణా అరిగిపోతూ వుంటాయి.
ఆప్టికల్‌ మౌస్‌
ఆధునాతన ఆప్టికల్‌ టెక్నాలజీతో తయారయ్యాయి కాబట్టి మెయింటెనెన్స్‌ బాధ వుండదు. కర్సర్‌ కదలికలు కూడా చాలా ఖచ్చితంగా వుంటాయి. మెకానికల్‌ పార్ట్స్‌ వుండవు కాబట్టి అరుగుదల, చెడిపోవడం అనేది వుండదు. ఈ మౌస్‌లో చిన్న కెమెరాతో పాటు లైట్‌ ఎమిటింగ్‌ డయోడ్‌, డిజిటల్‌ ప్రోసెసింగ్‌ యూనిట్‌లుంటాయి. లెడ్‌ ద్వారా మౌస్‌ కింద వెలుగు వస్తుంది. దానిలోని కెమెరా ఈ వెలుగు సాయంతో పాటర్న్‌ని ఫొటోలు తీసి నావిగేషన్‌ సెన్సర్‌కి అందజేస్తుంది. మౌస్‌లోని కెమెరా సెకనుకు వెయ్యి స్నాప్‌లు తీయగలదు. మనం మౌస్‌ను ఉపయోగించేటప్పుడు కదలికల ఆధారంగా కెమెరా తీసే పాటర్స్‌ మార్పులు సంభవిస్తాయి. ఈ స్నాప్‌ షాట్‌ల ఆధారంగా మౌస్‌ ఏ దిశగా ఎంత దూరం, ఎంత వేగంతో కదపబడిందనేది గుర్తించడం జరుగుతుంది. ఈ ప్రాసెస్‌నంతా డిజిటల్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ చేస్తుంది. స్నాప్‌ షాట్‌ల ఆధారంగా మౌస్‌ కదలికలు డిజిటల్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ ద్వారా గుర్తించి కంప్యూటర్‌కు అందజేస్తుంది. ఈ విధంగా పూర్తి ఆప్టికల్‌ టెక్నాలజీతో పనిచేయడం వల్ల ఈ మౌస్‌లు అత్యంత ఎక్కువ పనితనాన్ని చూపుతున్నాయి.
వైర్‌లెస్‌ మౌస్‌
ఇది రేడియో ఫ్రీక్వెన్సీ టెక్నాలజీతో పనిచేస్తుంది. ఇతర మౌస్‌ల వలే కేబుల్‌ ద్వారా కంప్యూటర్‌ కనెక్ట్‌ చేయబడదు. ఇది పనిచేయడానికి రేడియో ట్రాన్స్‌మీటర్‌, రేడియో రీసివర్‌ అవసరమౌతాయి. దీనిలో మూడు రకాల మౌస్‌లున్నాయి. అవి 1. మెకానికల్‌ 2. ఆప్టికల్‌ 3.లేజర్‌.

Post a Comment

0Comments

Post a Comment (0)