బరువు తగ్గాలనుకుంటే అరటి,ద్రాక్ష,అవోకాడో తినకండి !

Telugu Lo Computer
0


పండ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వాటి వినియోగం ఆరోగ్యానికి ప్రయోజనకరంగా, బరువు తగ్గే ప్రక్రియలో అవసరమైనదిగా పరిగణిస్తారు. అయితే కొన్ని రకాల పండ్లు బరువు తగ్గించడానికి బదులుగా బరువును పెంచుతాయి. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవాళ్ళు కొన్ని రకాల పండ్లను ఆహారంలో తీసుకోకుండా ఉండడం ఉత్తమమని డాక్టర్లు వెల్లడిస్తున్నారు. అరటి పండులో ఎక్కువ మొత్తంలో కేలరీలు ఉంటాయి. అంటే 7 నుంచి 8 అంగుళాల పొడవు, 118 గ్రాముల బరువు ఉన్న పండులో 105 కేలరీలు ఉంటాయి. బరువు పెరగాలనుకునే వారు అరటిపండ్లను తినొచ్చు. ప్రస్తుత సీజన్లో దొరికే మామిడి పండు చాలా రుచిగా ఉంటుంది. అయితే బరువు పెంచే పండ్లలో ఇది కూడా ఒకటి. దానికి దూరంగా ఉండాలి. ద్రాక్షలో చక్కెర, కొవ్వు రెండూ అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి రెండూ బరువును పెంచుతాయని ఆరోగ్య నిఫుణులు చెబుతున్నారు. 100 గ్రాముల ద్రాక్షలో 67 కేలరీలు ఉంటాయి. 16 గ్రాముల చక్కెర ఉంటుంది. కాబట్టి బరువు తగ్గాలనుకుంటే ద్రాక్షను తినకపోవడమే మంచిదని వైద్యనిపుణులు చెబుతున్నారు. 100 గ్రాముల అవోకాడోలో దాదాపు 160 కేలరీలు ఉంటాయి. ఇది ఆరోగ్యకరమైన కొవ్వుకు మంచి మూలం. ఎండుద్రాక్ష ఎక్కువగా తింటే బరువు పెరుగుతారు. అందుకే బరువు తగ్గాలనుకుంటున్న వాళ్లు ఇలాంటి పండ్లకు దూరంగా ఉండాలి. 

Post a Comment

0Comments

Post a Comment (0)