స్వల్పంగా తగ్గిన బంగారం ధర !

Telugu Lo Computer
0


కొద్ది రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలు దిగి వస్తున్నాయి. అమెరికాలో ద్రవ్యోల్బణం ఆందోళనకరంగానే కొనసాగుతుండటంతో యూఎస్ ఫెడ్ రిజర్వు వడ్డీరేట్ల తగ్గింపు జాప్యం అయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం దేశ రాజధానిలో తులం బంగారం (24 క్యారట్లు) ధర రూ.350 తగ్గి రూ.72 వేల వద్ద ముగిసిందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ తెలిపింది. గురువారం తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.72,350 పలికింది. మరోవైపు కిలో వెండి ధర రూ.83,500 వద్ద స్థిరంగా కొనసాగుతున్నది.ఢిల్లీ మార్కెట్లో 24 క్యారట్ల బంగారం తులం ధర గురువారంతో పోలిస్తే శుక్రవారం రూ.350 తగ్గి రూ.72,000 వద్ద కొనసాగుతున్నది' అని హెచ్డీఎఫ్సీ కమోడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో కామెక్స్ లో స్పాట్ గోల్డ్ ఔన్స్ ధర.. క్రితం సెషన్ తో పోలిస్తే ఏడు డాలర్లు తగ్గి 2,297 డాలర్ల వద్ద ముగిసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)