ఫోన్‌ ట్యాపింగ్ కేసులోమనీలాండరింగ్‌ కోణాన్ని విచారించాలని హైకోర్టు న్యాయవాది ఈడీకి ఫిర్యాదు !

Telugu Lo Computer
0


తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మనీలాండరింగ్‌ కోణాన్ని విచారించాలని హైకోర్టు న్యాయవాది సురేష్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)ని కోరారు. ఈ మేరకు ఈరోజు ఆయన ఈడీకి ఫిర్యాదు చేశారు. ఈ కేసులో పీఎంఎల్‌ఏ చట్టం కింద కేసు నమోదు చేయాలన్నారు. ప్రముఖ వ్యాపారుల ఫోన్‌లు ట్యాప్‌ చేసి వారిని బ్లాక్‌ మెయిల్‌ చేయడం ద్వారా కోట్లు వసూలు చేశారని, ఈ డబ్బును పోలీసు వాహనాల్లో ఎన్నికల కోసం తరలించారని నిందితులే ఒప్పుకున్న విషయాన్ని ఆయన ఫిర్యాదులో ప్రస్తావించారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో అసలు నిందితులను ఇప్పటివరకు విచారించలేదని, ఈడీ కేసు నమోదు చేసి విచారిస్తే అసలు నిందితులు బయటికి వస్తారని ఫిర్యాదులో తెలిపారు. కాగా, గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో రాజకీయ నాయకులతో పాటు పలు రంగాలకు చెందిన ప్రముఖుల ఫోన్‌లు ట్యాప్‌ చేసిన కేసులో పోలీసులు ఇప్పటికే ముమ్మర దర్యాప్తు జరుపుతున్నారు. అప్పట్లో ఇంటెలిజెన్స్‌ బ్యూరోలో కీలక పాత్ర వహించిన పలువురు పోలీసు ఉన్నతాధికారులను ఈ కేసులో ఇప్పటికే అరెస్టు చేసి విచారిస్తున్న విషయం తెలిసిందే. గత ప్రభుత్వంలో ఎస్‌ఐబీ చీఫ్‌గా పనిచేసి ఫోన్‌ ట్యాపింగ్ వ్యవహరంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభాకర్‌రావు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)