నేను సీఎంగా ఉండుంటే పోలవరం పూర్తయ్యేది !

Telugu Lo Computer
0


ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తాడికొండలో జరిగిన ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు పాల్గొని మాట్లాడుతూ అమరావతి రైతులు, మహిళల పోరాటం చరిత్రలో నిలిచిపోతుందని కొనియాడారు. జగన్‌ లాంటివాళ్లు వెయ్యి మంది వచ్చినా రాజధానిని కదల్చలేరని చంద్రబాబు అన్నారు. వైసీపీ ప్రభుత్వం రాజధాని రైతులను ఇబ్బందులు పెట్టారని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. విశాఖను ఆర్థిక రాజధానిగా మారుస్తామని హామీ ఇచ్చారు. తిక్కలోడికి ప్రజలు ఓటేస్తే రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశాడని దుయ్యబట్టారు. సంపద సృష్టించే కేంద్రంగా రాజధాని తయారు చేస్తామని.. కర్నూలు, విశాఖను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. తాను సీఎంగా ఉంటే ఇప్పటికే పోలవరం పూర్తయ్యేది అని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.జగన్‌ పాలనతో ఈ రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందని చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీ నేతలకు కమిషన్లు ఇవ్వలేక పరిశ్రమలు పారిపోయాయి. రాష్ట్ర యువతకు వైసీపీ తీరని ద్రోహం చేసింది” అని చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)