నిలకడగా ఉన్న బంగారం, వెండి ధరలు !

Telugu Lo Computer
0


రుసగా రెండు రోజులు పెరిగిన బంగారం ధరలకు కాస్త బ్రేక్ పడింది. బులియన్ మార్కెట్‌లో ఈరోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,850గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,930గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం, 24 క్యారెట్ల బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,000గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,080గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.66,850 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.72,930గా నమోదైంది. చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.67,700గా.. 24 క్యారెట్ల ధర రూ.72,760గా ఉంది. బెంగళూరు, కోల్‌కతా, కేరళ, హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.66,850 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.72,930గా నమోదైంది. వెండి ధరలు కూడా స్థిరంగానే ఉన్నాయి. కిలో వెండి రూ.84,000లుగా ఉంది. ఈరోజు ఢిల్లీలో కిలో వెండి ధర రూ.84,000 కాగా.. ముంబైలో రూ.84,000గా ఉంది. చెన్నైలో రూ.87,500గా కొనసాగుతుండగా.. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.87,500లుగా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.84,000గా ఉంది.

Post a Comment

0Comments

Post a Comment (0)