లారీని ఢీ కొట్టిన కారు ఘటనలో ఇద్దరు మృతి !

Telugu Lo Computer
0


తెలంగాణలోని సంగారెడ్డి ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ముందు వెళ్తున్న లారీని.. వేగంగా వచ్చిన కారు ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో కారులో ఆరుగురు ఉండగా.. ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. మిగతా నలుగురికి గాయాలయ్యాయి. వీరంతా కర్ణాటకకు వెళ్లి తిరిగి ఓల్డ్ సిటీకి వస్తుండగా.. కొల్లూరు ఎగ్జిట్ గేట్ 2 వద్ద లారీని ఢీ కొట్టింది. మృతులు మనోవర్, ఫాతిమాలుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద ప్రాంతానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స కోసమై ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పటాన్ చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.


Post a Comment

0Comments

Post a Comment (0)