ఆంధ్రప్రదేశ్ నుంచి జగన్ మాఫియాను తన్ని తరిమేస్తాం !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి ప్రచారంలో భాగంగా పి.గన్నవరంలో నిర్వహించిన బహిరంగ సభలో పవన్ సీఎం జగన్ పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. జగన్ మాఫియాను ఏపీ నుంచి తన్ని తరిమేస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు పవన్.ప్రేమ సీమగా ఉన్న కోనసీమను జగన్ కలహాల, కొట్లాట సీమగా చేశారని మండిపడ్డారు. రాజకీయ దురందురుడు చంద్రబాబు అని కొనియాడారు. కోనసీమలో క్రాప్ హాలిడే రాకుండా చూసుకుంటామని మాటిచ్చారు. కోనసీమకు ఇచ్చిన హామీలను జగన్ ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. 2022 జూలైలో జగన్ ఇక్కడ పర్యటించిన సమయంలో రూ. 30 కోట్లు హామీలిచ్చి ఒక్క రూపాయి కూడా ఎందుకు విడుదల చేయలేదని నిలదీశారు. ఆడబిడ్డలకు రక్షణ కల్పించలేని వైసీపీ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి అవసరం లేదని జనసేనాని అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)