హైదరాబాద్ లో మే 4న డైరెక్టర్స్ డే వేడుకలు !

Telugu Lo Computer
0


ర్శకరత్న దాసరి నారాయణరావు జయంతి అయిన మే 4వ తేదీన తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ డైరెక్టర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటోంది. ఇప్పటికే నాలుగుసార్లు డైరెక్టర్స్ డేను సెలబ్రేట్ చేయగా ఈ ఏడాది ఐదవసారి హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఘనంగా డైరెక్టర్స్ డే వేడుకలు నిర్వహించబోతున్నారు. ఈ ఈవెంట్ వివరాలను డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెస్ మీట్ లో వివరించారు. డైరెక్టర్ వీర శంకర్ మాట్లాడుతూ- దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతిని మొదటిసారి ఎఫ్ఎన్ సీసీలో ఘనంగా నిర్వహించాం, అప్పుడు అనిల్ రావిపూడి, హరీశ్ శంకర్ వంటి డైరెక్టర్స్ అంతా స్కిట్స్ చేసి ప్రోగ్రాం సక్సెస్ చేశారు. రాఘవేంద్రరావు, చిరంజీవి అతిథులుగా పాల్గొన్నారు. కరోనా వల్ల రెండేళ్లు డైరెక్టర్స్ డే సెలబ్రేట్ చేయలేకపోయాం, ఆ తర్వాత మళ్లీ ఎఫ్ఎన్ సీసీలో ఈ కార్యక్రమం నిర్వహించగా ఇప్పుడు ఐదోసారి ఎల్బీ స్టేడియంలో భారీ ఎత్తున డైరెక్టర్స్ డే నిర్వహించబోతున్నాం. ఇలా స్టేడియంలో ఈ వేడుకలు నిర్వహించడం ఇదే తొలిసారి. ఈ ఈవెంట్ ద్వారా ఫండ్ రైజింగ్ చేసి డైరెక్టర్స్ అసోసియేషన్ సభ్యుల సంక్షేమం కోసం మిడ్ డే మీల్స్, అసోసియేషన్ కు కొత్త బిల్డింగ్ నిర్మాణం, వయసు పైబడిన దర్శకులకు ఆర్థిక సహాయం వంటి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాం అన్నారు. ఈ ప్రోగ్రామ్ నిర్వహణకు ఈసారి కల్చరర్ కమిటీ ఏర్పాటు చేశాం, ఆ కమిటీలో అనిల్ రావిపూడి, శివ నిర్వాణ, నందిని రెడ్డి, అనుదీప్ కేవీ, విజయ్ కనకమేడల వంటి డైరెక్టర్స్ ఉంటారని, 15 వేల మంది దాకా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ఆశిస్తున్నాం అని అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)