మిషన్‌ దివ్యాస్త్ర ప్రయోగం విజయవంతం

Telugu Lo Computer
0


క్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ 'మిషన్‌ దివ్యాస్త్ర' పేరుతో బహుళ లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యంతో రూపొందించిన 'అగ్ని-5' క్షిపణిని మొదటిసారి విజయవంతంగా పరీక్షించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డీఆర్‌డీవో శాస్త్రవేత్తలను 'ఎక్స్‌' వేదికగా అభినందించారు. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ అధునాతన క్షిపణిని 'మల్టిపుల్‌ ఇండిపెండెంట్‌ టార్గెటబుల్‌ రీ-ఎంట్రీ వెహికల్‌' సాంకేతికతతో అభివృద్ధి చేశారు. దీనిద్వారా ఒకే క్షిపణి సాయంతో అనేక వార్‌హెడ్లను వేర్వేరు లక్ష్యాలపై ప్రయోగించవచ్చు. అణ్వాయుధ సామర్థ్యం ఉన్న ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణి 'అగ్ని-5'కి.. ఐదు వేల కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగల సత్తా ఉంటుంది. పొరుగుదేశం చైనా వద్ద డాంగ్‌ఫెంగ్‌-41 వంటి క్షిపణులున్నాయి. వీటి పరిధి 12,000 నుంచి 15,000 కి.మీ. ఉంటుంది. ఈనేపథ్యంలో చైనాను దృష్టిలో పెట్టుకొని అగ్ని-5ను భారత్‌ తయారుచేసింది. ఆసియా యావత్తూ దీని పరిధిలోకి వస్తుంది. అగ్ని-1 నుంచి అగ్ని-4 రకం క్షిపణులు 700-3,500 కి.మీ. మధ్య దూరాన్ని ఇవి చేరుకోగలవు. అవన్నీ మన రక్షణ బలగాలకు అందుబాటులోకి వచ్చాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)