టిక్‌టాక్‌పై నిషేధిస్తే ఫేస్‌బుక్‌ లాభం పొందుతుంది !

Telugu Lo Computer
0


టిక్‌టాక్‌పై నిషేధం విధిస్తే ఫేస్‌బుక్‌ లాభం పొందుతుందని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. గతంలో చేసిన వ్యాఖ్యలకు భిన్నంగా తాజా కామెంట్లు ఉన్నాయి. యూజర్ల సమాచారం సేకరిస్తున్నారనే ఆరోపణలతో భారత్‌ సహా పలు దేశాలు టిక్‌ టాక్‌పై నిషేధం విధించాయి. గతంలో డొనాల్డ్‌ ట్రంప్‌ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అమెరికా కూడా దీనిపై చర్యలకు సిద్ధమైంది. కానీ న్యాయపరమైన సమస్యల కారణంగా అది కార్యరూపం దాల్చలేదు. తాజాగా మరోసారి దీనిపై చర్చ మొదలైంది. బుధవారం టిక్‌టాక్‌పై నిషేధం విధించే బిల్లును రిపబ్లికన్లు యూఎస్‌ హౌస్‌లో ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో టిక్‌టాక్‌కు మద్దతుగా ట్రంప్‌ వ్యాఖ్యలు చేయడం ఇందుకు కారణం. దీనిపై నిషేధం విధిస్తే ఫేస్‌బుక్‌ లాభపడుతుందని ఆయన వ్యాఖ్యానించారు. టిక్‌టాక్‌తో మంచీ, చెడు రెండూ ఉన్నాయని. దేశంలో యువత సహా ఎంతోమంది ఆ యాప్‌ను ఇష్టపడుతున్నారని తెలిపారు. దీనిపై నిషేధం విధిస్తే ఫేస్‌బుక్‌కు లాభం చేకూరుతుందని అభిప్రాయపడ్డారు. ఆ సంస్థ వ్యాపారం రెండితలవుతుందని చెప్పుకొచ్చారు. వాస్తవానికి అమెరికన్లకు నిజమైన శత్రువు ఫేస్‌బుక్‌నే తెలిపారు. టిక్‌టాక్‌ ద్వారా అమెరికన్ల డేటా చైనా సేకరించడం దేశ భద్రతకు ముప్పే అని అభిప్రాయపడ్డారు. కానీ దానిపై నిషేధం విధించి ఫేస్‌బుక్‌ను పెద్దదాన్ని చేయడం మంచిది కాదని ట్రంప్‌ వ్యాఖ్యానించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)