పాకిస్థాన్‌లో సైనిక స్థావరంపై ఆత్మాహుతి దాడి !

Telugu Lo Computer
0


వాయువ్య పాకిస్థాన్‌లోని ఖైబర్‌ పఖ్తుంఖ్వా రాష్ట్రంలోని ఉత్తర వజీరిస్థాన్‌ జిల్లాలో సైనిక స్థావరంపైనే ఆత్మాహుతి దాడి చేశారు. భారీగా పేలుడు పదార్థాలను అమర్చిన వాహనంతో సైనిక పోస్టును ఢీకొట్టారు. ఈ ఘటనలో పలువురు సైనికులు చనిపోయారు. ఆ తర్వాత భద్రతా దళాలతో జరిగిన కాల్పుల్లో ఆరుగురు ఉగ్రవాదులు కూడా హతమయ్యారు. వారిలో కొందరు బాంబులు అమర్చిన ఆత్మాహుతి దాడి జాకెట్లను ధరించినట్లు గుర్తించారు. కొత్తగా ఏర్పాటు చేసిన జైషే ఫురాసనే మహమ్మద్‌ సంస్థ ఈ దాడికి బాధ్యత వహించింది. బాంబు పేలుడులో ఐదుగురు సైనికులు, అనంతరం చోటు చేసుకొన్న కాల్పుల్లో ఇద్దరు ఆఫీసర్లు చనిపోయినట్లు పాక్‌ సైన్యం వెల్లడించింది. మిలటరీ పోస్టు కూడా ఒక వైపు పూర్తిగా కూలిపోయిందని తెలిపింది. ఈ దాడిని పాకిస్థాన్‌ అధ్యక్షుడు ఆసీఫ్‌ అలీ జర్దారీ, ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ఖండించారు. ఉత్తర వజీరిస్థాన్‌ చాలా ఏళ్లుగా పాక్‌ తాలిబన్లు సహా పలు ఉగ్ర సంస్థలకు కీలక కేంద్రంగా ఉంది.

Post a Comment

0Comments

Post a Comment (0)