సరిహద్దు వివాదం ద్వైపాక్షిక సంబంధాలకు ప్రతిబంధకం కాదు !

Telugu Lo Computer
0


భారత్‌తో సరిహద్దు వివాదం ద్వైపాక్షిక సంబంధాలను పూర్తిగా ప్రతిబింబించదని చైనా విదేశాంగశాఖ ప్రతినిధి వాంగ్‌ వెన్‌బిన్‌ వెల్లడించారు. ఇరు పక్షాల మధ్య అపనమ్మకాన్ని తొలగించి విశ్వాసాన్ని పెంచుకొనేందుకు చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు. సరిహద్దుల్లో బలగాల మోహరింపు వల్ల ఇరు పక్షాలకు ఉపయోగం లేదని భారత విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ చేసిన వ్యాఖ్యలపై వెన్‌బిన్‌ మాట్లాడుతూ ద్వైపాక్షిక సంబంధాల్లో సరిహద్దు వివాదానికి తగిన స్థానం ఇవ్వాలన్నారు. ''సరిహద్దు వివాదం వీలైనంత త్వరగా పరిష్కరించుకోవడమే ద్వైపాక్షిక ప్రయోజనాలను కాపాడుతుందని ఇరు దేశాలు బలంగా నమ్ముతున్నాయి. భారత్‌-చైనా మధ్య ఉన్న ఒప్పందాలు, నాయకుల మధ్య అవగాహనను ఉభయపక్షాలు కొనసాగిస్తాయని నమ్ముతున్నాను. దౌత్య, సైనిక మార్గాల్లో కమ్యూనికేషన్లను కొనసాగించాలి. సరిహద్దు వివాదంలో ఇరు వర్గాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొనాలి. పరస్పర విశ్వాసం పెంచుకొని అపోహలను తొలగించుకోవాలి. సంప్రదింపుల వేదికను ఏర్పాటు చేసుకొని సహకరించుకోవాలి. అడ్డంకులను సృష్టించకుండా చూసుకోవాలి'' అని వాంగ్‌ పేర్కొన్నారు. ఈ విషయంలో భారత్‌ కూడా చైనాతో కలిసి పనిచేస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.


Post a Comment

0Comments

Post a Comment (0)