పాకిస్తాన్‌ రాయబారి మునీర్ అక్రమ్ వ్యాఖ్యలపై రుచిరా కంబోజ్ ఘాటుస్పందన !

Telugu Lo Computer
0


క్యరాజ్య సమతిలో పాకిస్తాన్‌ రాయబారిపై భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కంబోజ్‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఐక్యరాజ్యసమితిలో పాకిస్తాన్‌ ఒక పగలగొట్టబడిన రికార్డు అని ఆమె ఎద్దేవా చేశారు. శుక్రవారం ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీలో పాకిస్తాన్‌ రాయబారి మునీర్ అక్రమ్ చేసిన వ్యాఖ్యలపై రుచిరా కంబోజ్ ఘాటుగా స్పందించారు. 'ఇస్లామోఫోబియాను ఎదుర్కొవటానికి చర్యలు'పై తీర్మాన్నాని ప్రవేశపెట్టే సందర్భంలో పాక్‌ రాయబారి మునీర్‌ అక్రమ్‌ భారత దేశానికి సంబంధించిన రామ మందిర్‌ నిర్మాణం, సీఏఏ అమలు అంశాలను ప్రస్తావించారు. మునీర్‌ అక్రమ్‌ చేసిన వ్యాఖ్యలపై రుచిరా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 'మా దేశం (భారత్‌)కు సంబంధించిన విషయాలపై పాకిస్తాన్‌ చాలా పరిమితమైన, తప్పుదోవ పట్టించే అభిప్రాయాలు కలిగి ఉండటం దురదృష్టకరం. ప్రపంచం మొత్తం ఒకవైపు అభివృద్ది మార్గంలో దూసుకువెళ్తుంటే పాక్‌ తీవ్ర విషాదంతో కూడిన స్తబ్దతను కనబరుస్తోంది. ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్‌ ఒక పగలగొట్టబడిన రికార్డు' అని రుచిరా మండిపడ్డారు. ఇక పాకిస్తాన్‌ ప్రవేశపెట్టిన తీర్మానానికి అనుకూలంగా 115 దేశాలు ఓటు వేయగా.. ఎవరు వ్యతిరేకంగా ఓటు వేయలేదు. కానీ, 44 దేశాలు ఓటింగ్‌లో పాల్గొనలేదు. ఇండియాతోపాటు బ్రెజిల్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ, ఉక్రెయిన్‌, యూకే ఓటింగ్‌లో పాల్గొనలేదు.

Post a Comment

0Comments

Post a Comment (0)