నరేంద్ర మోడీతో మమతా బెనర్జీ భేటీ !

Telugu Lo Computer
0


ప్రధాని నరేంద్ర మోడీతో పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ సమావేశమయ్యారు. రెండు రోజుల పర్యటన కోసం రాష్ట్రానికి వచ్చిన ప్రధాని శుక్రవారం రాత్రికి రాజ్‌భవన్‌లోనే ఉండనున్నారు. ఈనేపథ్యంలో సీఎం మమత, ప్రధానితో సమావేశమయ్యారు. గతేడాది డిసెంబర్‌లో తమ రాష్ట్రానికి రావాల్సిన బకాయిలను విడుదల చేయాలని కోరుతూ ఢిల్లీలో కలిసిన తర్వాత మళ్లీ ప్రధాని మోడీని కలవడం ఇదే తొలిసారి. మోడీతో భేటీ అనంతరం మమత మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాష్ట్రపతి లేదా ప్రధానమంత్రి రాష్ట్రాన్ని సందర్శిస్తే సీఎం వెళ్లి వారిని కలవడం ఓ ప్రొటోకాల్‌ అన్నారు. ఇది మర్యాదపూర్వక భేటీయేనని, రాజకీయ అంశాలేవీ చర్చించలేదన్నారు. ఎందుకంటే ఇది రాజకీయ సమావేశం కాదని చెప్పారు. ఇదిలాఉండగా.. తమ రాష్ట్రానికి కేంద్రం నుంచి రూ.1.18లక్షల కోట్ల బకాయిలు రావాలని తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. 2022 మార్చి నుంచి పెండింగ్‌లో ఉన్న దాదాపు 30 లక్షల మంది నరేగా కార్మికులకు ₹2,700 కోట్ల బకాయిల చెల్లింపును రాష్ట్ర ప్రభుత్వం సోమవారమే ప్రారంభించింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)