రాజకీయ పార్టీలకు ఎన్నికల కమిషన్ హెచ్చరిక !

Telugu Lo Computer
0


న్నికల ప్రచారాల్లో కులం, మతం, భాష ప్రాతిపదికన ఓట్లు అడగడం మానుకోవాలని ఎన్నికల కమిషన్ సూచించింది. మత విశ్వాసాలను కించపరచడం, దైవ దూషణకు పాల్పడకూడదని చెప్పింది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ప్రార్థనా స్థలాలను ఎన్నికల ప్రచారాలకు ఉపయోగించకూడదని పేర్కొంది. గతంలో నోటీసులు అందుకున్న స్టార్ క్యాంపెయినర్లు, అభ్యర్థులు మళ్లీ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. మార్చి నెలాఖరులోపు లోక్ సభ, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీల ప్రకటనతో మోడల్ కోడ్ అమల్లోకి రానుంది. బహిరంగ సభల్లో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, స్టార్ క్యాంపెయినర్లు, అభ్యర్థులు, ముఖ్యంగా గతంలో నోటీసులు అందుకున్న వారు అదనపు బాధ్యత వహించాలని చెప్పింది. ప్రజా సమస్యలపై మాట్లాడాలని సూచించింది. అబద్ధాలు చెబుతూ ఓటర్లను తప్పుదోవ పట్టించకూడదని, ప్రత్యర్థులను దూషించే లేదా అవమానించే సోషల్ మీడియా పోస్టులు పెట్టడం, షేర్ చేయడం వంటి పనుల్ని చేస్తే చర్యలు తప్పవని స్పష్టం చేసింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)