బెంగళూరులో నీటి సరఫరాను 20 శాతం తగ్గిస్తూ నిర్ణయం !

Telugu Lo Computer
0


బెంగళూరు నగరంలో నీటి సరఫరాను 20 శాతం తగ్గిస్తూ కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కర్ణాటకలో కరువు శివతాండవం చేస్తుంది. నీళ్లు లేక కర్ణాటక వాసులు అలమటిస్తున్నారు. గత కొన్ని రోజులుగా కర్ణాటక రాష్ట్రంలో మంచి నీటి, సాగు నీటి సమస్యతో జనాలు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా బెంగళూరులో నీటి సమస్య స్పష్టం కనిపిస్తోంది. తాగునీటికి బెంగళూరు నగరం  ఇబ్బందిపడుతోంది. దీంతో తాగునీటి సరఫరాను 20 శాతం తగ్గిస్తూ నోటీస్ జారీ చేసింది అక్కడి కాంగ్రెస్‌ ప్రభుత్వం. వేసవి ముదిరే కొద్దీ 40 శాతానికి పెరుగుతుందని హెచ్చరికలు చేసింది. నీరు వృథా చేస్తే రూ.5 వేల జరిమానా విధిస్తామని, నీటి వాడకాన్ని పర్యవేక్షించేందుకు సెక్యూరిటీ గార్డు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది కర్ణాటక సర్కార్‌. ఇక అటు నా ఇంట్లోనే బోర్ ఎండిపోయింది ఏం చేయమంటారన్నారు. మొత్తంగా 30 వేల బోర్లు ఎండిపోగా తన ఇంట్లోనే బోర్ ఎండిపోయిందని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)