ఆంధ్రప్రదేశ్ లో 18 నుంచి ఒంటిపూట బడులు !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో ఈ నెల 18 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌ సురేష్‌కుమార్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉదయం 7.45 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించాలని తెలిపారు. ఏప్రిల్‌ 23వ తేది చివరి పనిదినంగా వెల్లడించారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్‌, మున్సిపల్‌, ఎయిడెడ్‌, ప్రైవేట్‌ పాఠశాలలు అకడమిక్‌ క్యాలెండర్‌ ప్రకారం ఒంటిపూట బడులను నిర్వహించాల్సిందేనని పేర్కొన్నారు. అన్ని పాఠశాలల్లో తాగునీరు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని తెలిపారు. మధ్యాహ్న భోజనాన్ని ఇంటికి వెళ్లే సమయంలో అందించాలని పేర్కొన్నారు. తరగతులను చెట్ల కింద, తరగతుల బయట నిర్వహించొద్దని హెచ్చరిం చారు. ఈ నెల 18వ తేది నుంచి 24వ తేది వరకు పదో తరగతి పరీక్షలు కూడా జరగనున్నాయి. ఈ పరీక్షలు జరిగే పాఠశాలలకు సెలవులుగా ప్రకటించిన ఈ నెల 24, 31 తేదీలతో పాటు ఏప్రిల్‌ 7,13,14, 21 తేదీల్లో తరగతులు నిర్వహించాలని ఆదేశించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)