హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం !

Telugu Lo Computer
0


హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఓ స్టార్ హోటల్‌లో పోలీసులు భారీగా కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి మనవడు, బీజేపీ నేత కుమారునితో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్‌లో డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్టు అందిన సమాచారం మేరకు ఆదివారం అర్ధరాత్రి గచ్చిబౌలి పోలీసులు దాడులు జరిపారు. ఈ క్రమంలో ముగ్గురిని అరెస్ట్ చేశారు. వీరిలో మాజీ ముఖ్యమంత్రి రోశయ్య అల్లుడు, బీజేపీ నాయకుడు యోగానంద్ కుమారుడు వివేకానంద్ ఉన్నాడు. అదుపులోకి తీసుకున్న ముగ్గురి నుంచి పోలీసులు భారీ మొత్తంలో కొకైన్ సీజ్ చేశారు. వివేకానంద్‌తో పాటు అతని ఇద్దరు స్నేహితులు కొకైన్ సేవించినట్టుగా అనుమానాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో ముగ్గురికి డ్రగ్ టెస్టులు జరుపుతామన్నారు. వీటిలో వెళ్లడయ్యే ఫలితాలను బట్టి కేసులు నమోదు చేస్తామన్నారు. వివేకానంద్ తండ్రి యోగానంద్ గతంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)