దేశ విభజన కుట్రలు సహించం !

Telugu Lo Computer
0


రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రసంగించారు. ఈ సందర్భంగా దక్షిణాదిపై టార్గెట్ గా ప్రసంగించారు. కొందరు దక్షిణ భారత దేశం కావాలంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశమంటే దేహం లాంటిదని, దానిని ముక్కలు కానివ్వబోమని అన్నారు. దేశంలో ఏ ప్రాంతంలో ఇబ్బంది కలిగినా దేశం మొత్తానికి ఇబ్బందేనని అన్నారు. ఒకరు భాష కోసం కొట్లాడుతారు. హిమాలయాలు నదులు నా వల్లే ప్రవహిస్తున్నాయంటే నీళ్ల కోసం ఎక్కడికి వెళ్లాలి ? అన్నారు. నిధుల కోసం ఓ రాష్ట్రం ఢిల్లీలో ధర్నా చేసింది. మరో రాష్ట్రం మా బొగ్గు మాకే కావాలంటోంది, మరో  రాష్ట్రం మా రాష్ట్రం.. మా ట్యాక్స్ అంటున్నదని, ఇదెక్కడి న్యాయం. రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వానికి వివక్ష లేదు. రాష్ట్రాల హక్కులకు ఎప్పుడూ ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు. త్వరలో మోడీ మూడో ఇన్నింగ్స్ స్టార్టవుతుందని చెప్పారు. మోడీ తన ప్రసంగంలో కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి 40 సీట్లుకూడా రావన్నారు. ఆ పార్టీ మూలాలే బ్రిటీషర్లవని చెప్పారు. పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగించిందే కాంగ్రెస్ ప్రభుత్వమని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని అన్నారు

Post a Comment

0Comments

Post a Comment (0)