ఎన్ఠీఆర్ కు కూడా భారతరత్న ఇస్తే తెలుగు జాతి పులకించిపోయేది !

Telugu Lo Computer
0


పీవీకి భారత రత్న ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఆత్మగౌరవ విజయకేతనమైన పద్మశ్రీ ఎన్టీఆర్‌కు కూడా భారతరత్న ప్రకటించి ఉంటే యావత్ తెలుగు ప్రజానీకం మరింత పులకించిపోయేదని కాంగ్రెస్ నాయకురాలు, సినీ నటి విజయశాంతి అన్నారు. ఈ మేరకు ఎన్టీఆర్ తో కలిసి ఉన్న ఫోటో షేర్ చేసిన ఆయన భారతరత్న వంటి అత్యున్నత అవార్డుల విషయంలో రాజకీయాల ప్రమేయం ఉండక పోవచ్చు కానీ, తెలుగుజాతి గౌరవ ప్రతీక శ్రీ పీవీ నరసింహా రావు గారిని వరించిన పురస్కారం మన ఆత్మగౌరవ విజయకేతనమైన పద్మశ్రీ ఎన్టీఆర్ గారికి కూడా ప్రకటించి ఉంటే తెలుగు ప్రజానీకం యావత్తు మరింత పులకించిపోయేదన్నది తిరుగులేని వాస్తవం. ఈ అంశాన్ని జాతీయ స్థాయికి తీసుకు వెళ్ళగలిగే అవకాశం ఈ రోజు నిండుగా, మెండుగా కనబడుతోంది. ఈ బాధ్యతను భుజాలకెత్తుకొని, అందరి సంకల్పాన్ని సిద్ధింపజేసే ప్రయత్నం తప్పక జరిగి తీరగలదని త్రికరణశుద్ధిగా నమ్ముతున్నాను. అన్ని రాజకీయ పార్టీలు ఈ అంశాన్ని బలపరుస్తారని కూడా నేను నమ్మడం అతిశయోక్తి కాదన్నది నా నిశ్చితాభిప్రాయం అని విజయశాంతి రాసుకొచ్చారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)