సీఎం రేవంత్ రెడ్డితో బొంతు రామ్మోహన్ భేటీ

Telugu Lo Computer
0


జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. బీఆర్ఎస్ ను వీడి త్వరలోనే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలి జీహెచ్ఎంసీ మేయర్ గా పని చేశారు బొంతు రామ్మోహన్. అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వరుసగా నేతలంతా పార్టీని వీడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే హైదరాబాద్ చుట్టుపక్కల చాలా మంది బీఆర్ఎస్ కు సంబంధించిన ఎమ్మెల్యేలు గెలిచిన పరిస్థితి ఉంది. అయితే, గెలిచిన వారంతా అధికార కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే హైదరాబాద్ నగర శివారుకి చెందిన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కాంగ్రెస్ లో చేరిన పరిస్థితి ఉంది. రంగారెడ్డి జిల్లాకు చెందిన మాజీమంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డితో పాటు రంగారెడ్డి జిల్లాకు చెందిన జెడ్పీ ఛైర్ పర్సన్ గా ఉన్న ఆయన భార్య సునీతా మహేందర్ రెడ్డి కూడా ఇప్పటికే సీఎం రేవంత్ ను కలిశారు. చేవెళ్ల పార్లమెంట్ టికెట్ కు సంబంధించి హామీ లభించడం వల్ల వారంతా కాంగ్రెస్ లో చేరుతున్నారు అనే ఊహాగానాలు వినిపడుతున్నాయి. త్వరలోనే మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. తనతో పాటు కొందరు ఎమ్మెల్యేలను కూడా కాంగ్రెస్ లోకి తీసుకెళ్లేందుకు మహేందర్ రెడ్డి కసరత్తు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)