ఢిల్లీ చలో మార్చ్‌ రెండు రోజుల పాటు వాయిదా

Telugu Lo Computer
0


ఢిల్లీ చలో నిరసనను రెండు రోజులపాటు నిలిపివేయాలని రైతు సంఘాలు  నిర్ణయించారు. పరిస్థితిని సమీక్షించి భవిష్యత్తు కార్యాచరణపై శుక్రవారం సాయంత్రం నిర్ణయం వెలువరిస్తామని ఈ సందర్భంగా వారు వెల్లడించారు. తమ పంటలకు కనీస మద్దతు ధర ఇచ్చేలా చట్టబద్ధత చేయడంతో పాటు, రుణమాఫీ, పలు డిమాండ్లతో రైతులు 'ఢిల్లీ చలో' మార్చ్‌ ను బుధవారం ఉదయం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇటీవలే జరిపిన నాలుగో దఫా చర్చల్లో కేంద్రం ప్రతిపాదనలను తిరస్కరించిన రైతులు.. బుధవారం ఉదయం తిరిగి పోరుబాట పట్టారు. ఈ నేపథ్యంలో పంజాబ్ – హర్యానా సరిహద్దులో ఆందోళనకారులు, పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్నది. రైతులపై పోలీసులు టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారు. ఈ ఘర్షణల్లో ఒక యువ రైతు మరణించాడు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఢిల్లీ చలో మార్చ్‌ను రెండు రోజుల పాటు నిలిపివేస్తున్నట్టు రైతు నేతలు ప్రకటించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)