క్యాన్సర్ వ్యాక్సిన్ కనిపెట్టిన రష్యా ?

Telugu Lo Computer
0


క్యాన్సర్ రాకుండా చేసే వ్యాక్సిన్, వచ్చినా తగ్గించడానికి ఇమ్యునోమోడ్యులేటరీ మందులపై పరీక్షలు జరుపుతుందని రష్యా అధ్యక్షుడు వ్లామిదిన్ పుతిన్ అన్నారు. ఫ్యూచర్ టెక్నాలజీ మీద బుధవారం జరిగిన మాస్కో ఫోరమ్ లో పాల్గొని ఆయన మాట్లాడారు. క్యాన్సర్ కు రష్యా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ప్రకటించారు. రష్యా కనిపెట్టిన క్యాన్సర్ వ్యాక్సిన్ వినియోగానికి చాలా దగ్గరగా వచ్చిందని అన్నారు. ఇప్పటికే అమెరికా, జర్మనీ పలు దేశాలు క్యాన్సర్ వ్యాక్సిన్ కనిపెట్టేందుకు పనిచేస్తున్నాయి. రష్యా తయారు చేసిన వ్యాక్సిన్ పై లాస్ట్ స్టేజ్ ట్రయల్స్ జరుగుతున్నాయని త్వరలో క్యాన్సర్ వ్యాక్సిన్ అందుబాటులోకి రానుందని పుతిన్ తెలిపారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)