ఫాస్ట్‌ట్యాగ్స్ జారీ అధికారం తొలగింపు !

Telugu Lo Computer
0


పేటీఎం పేమెంట్స్ బ్యాంకుకు ఫాస్ట్‌ట్యాగ్స్ జారీ అధికారాన్ని ఇండియన్ హైవేస్ మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్ తొలగించింది. అంతరాయం లేని ప్రయాణ అనుభవాలు పొందేందుకు 32 ఆథరైజ్డ్‌ బ్యాంకుల నుంచి ఫాస్ట్‌ట్యాగ్‌లను పొందాలని సూచించింది. హైవే ప్రయాణికులు టోల్ ప్లాజాల ద్వారా సజావుగా వెళ్లేందుకు ఆథరైజ్డ్‌ బ్యాంకుల నుంచి తమ ఫాస్ట్ ట్యాగ్‌లను పొందాలని ఇండియన్ హైవేస్ మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్ సూచించింది. ఈ లిస్టులోని 32 ఆథరైజ్డ్‌ బ్యాంకుల్లో ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యెస్ బ్యాంక్ వంటి ప్రముఖ బ్యాంకులు ఉన్నాయి. ప్రస్తుతం 8 కోట్ల మంది ఫాస్ట్‌ట్యాగ్ వినియోగదారులు ఉన్నారు. ఇందులో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ సుమారు 30 శాతం వాటాను కలిగి ఉందని ఇండియన్ హైవేస్ మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్ అధికారి న్యూస్‌ ఏజెన్సీ 'పీటీఐ'కి వెల్లడించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)