తహశీల్దార్ రమణయ్య హత్య కేసులో భార్య వాంగ్మూలం తీసుకున్న పోలీసులు !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ జిల్లాలో తహశీల్దార్ రమణయ్య హత్య కేసులో పోలీసుల దర్యాప్తులో సంచలన నిజాలు వెలుగు చూస్తున్నాయి. అనంత శర్మ(పూజారి )అనే వ్యక్తి ఫోన్ చేయడంతో రమణయ్య ఇంటి నుంచి కిందకి వచ్చినట్లు తెలిసింది. పూజారి వెళ్ళిపోయాక 30-35 ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తి వచ్చాడు. ఒక ఫైల్‌ను జాగ్రత్తగా ఉంచమని భార్యకు రమణయ్య ఇచ్చినట్లు సమాచారం. ఆ ఫైల్ విషయమై దుండగుడుతో గొడవ అయ్యి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. భార్య నుండి పోలీసులు వాంగ్మూలం తీసుకున్నారు. రెక్కీ నిర్వహించి ప్లాన్ ప్రకారమే దుండగులు హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వీధి చివర కదలికలు అప్డేట్ చేస్తూ దుండగులు గ్యాంగ్ సమాచారం ఇచ్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు మాట్లాడుతూ ఒక్కసారిగా ఇనుప రాడ్‌తో ఓ వ్యక్తి తహశీల్దార్‌పై అటాక్ చేశాడు. ప్రతి రోజు విధుల నుంచి రాత్రి 10, 11 గంటలకు ఇంటికి తిరిగి వచ్చే ఎమ్మార్వో రమణయ్య, తాజాగా విజయనగరం బొండపల్లిలో ఛార్జ్ తీసుకున్నారు. మొదటి రోజు కావడంతో రాత్రి 8 గంటలకే అపార్ట్మెంట్‌కు రమణయ్య చేరుకున్నారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో నలుగురు అనుమానిత నిందితులు ఉన్నారు, పీఎం పాలెం పోలీస్ స్టేషన్‌లో దర్యాప్తు కొనసాగుతోంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)