కేవైసీ పూర్తిచేయని ఫాస్టాగ్‌ల డీయాక్టివేట్‌ !

Telugu Lo Computer
0


కేవైసీ పూర్తిచేయని ఫాస్టాగ్‌లను నిలువరించేందుకు కేంద్ర  సిద్ధమైంది. ఇలాంటి కేవైసీలను జనవరి 31 తర్వాత బ్యాంకులు డీయాక్టివేట్‌ లేదా బ్లాక్‌ చేస్తాయని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఫాస్టాగ్‌లో బ్యాలెన్స్‌ ఉన్నా.. కేవైసీ పూర్తి చేయకపోతే జనవరి 31 తర్వాత వాటిని బ్యాంకులు డీయాక్టివేట్‌/బ్లాక్‌లిస్ట్‌ చేస్తాయని స్పష్టం చేసింది. ఈ అసౌకర్యాన్ని నివారించేందుకు యూజర్లు తమ ఫాస్టాగ్‌లకు కేవైసీ చేసుకోవాలని కోరింది. కొన్నిసార్లు వాహనదారులు ఫాస్టాగ్‌లను వాహనం ముందుభాగంలో పెట్టడం లేదని.. దానివల్ల టోల్‌ప్లాజాల్లో వాహనాల ఫాస్టాగ్ తనిఖీల్లో ఆలస్యం జరుగుతోందని తెలిపింది. ప్రత్యేక వాహనాల కోసం జారీ చేసిన ఫాస్టాగ్స్, కేవైసీ లేకుండా జారీ చేసిన ఫాస్టాగ్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లు ఇటీవల గుర్తించిన క్రమంలోనే ఎన్‌హెచ్ఏఐ ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇటీవలే వన్ వెహికల్- వన్ ఫాస్టాగ్ క్యాంపెయిన్ తీసుకొచ్చింది. ఒకే ఫాస్టాగ్ ను ఒకటికి మించి వాహనాలకు వినియోగించడం లేదా ఒకే వాహనానికి మల్టిపుల్ ఫాస్టాగ్స్ వాడడం వంటివి తగ్గించడానికి ఈ క్యాంపెయిన ప్రారంభించింది. టోల్ ప్లాజాల వద్ద ఇబ్బందులను తప్పించుకోవాలంటే వాహనదారులు తప్పనిసరిగా ఫాస్టాగ్ కేవైసీ పూర్తి చేయాలని కోరింది. లేటెస్ట్ కేవైసీ పూర్తి చేసిన ఫాస్టాగ్స్(FASTag – KYC) మాత్రమే యాక్టివ్‌గా ఉంటాయని ఎన్‌హెచ్ఏఐ స్పష్టం చేసింది.ఏదైనా సహాయం కోసం సమీపంలోని టోల్ ప్లాజాలను సంప్రదించడం లేదా ఫాస్టాగ్స్ జారీ చేసిన బ్యాంకుల టోల్ ఫ్రీ నంబర్లను సంప్రదించాలని కోరింది.

Post a Comment

0Comments

Post a Comment (0)