జ్యూవెలరీ షోరూమ్ లో భారీ చోరీ !

Telugu Lo Computer
0


హారాష్ట్రలోని పూణెలో ఆదివారం డౌన్‌టౌన్ ప్రాంతంలోని జ్యూవెలరీ షోరూమ్ లో చోరీ జరిగింది. ఈ మేరకు నగల దుకాణం యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా నగల దుకాణంలో అమర్చిన సీసీటీవీ ఫుటేజీని పోలీసులకు అందించారు. రాత్రి పూట ఒక దొంగ పుల్ ఓవర్ తో పాటు అతని శరీరం కనపడకుండా బట్టలు వేసుకున్నాడు. ముఖానికి మాస్క్, ఫుల్ ఓవర్ కప్పుకుని నగల దుకాణం తలుపులు పగులగొట్టిన దొంగ సులువుగా లోపలికి ప్రవేశించి లాకర్ లో ఉంచిన బంగారు ఆభరణాలను బయటకు తీసి అతను తెచ్చిన బ్యాగులో నింపాడు. అనంతరం బ్యాగులో 10 లక్షల నగదు నింపాడు. నగదు సహా రూ. 3 కోట్ల విలువైన 5 కిలోల బంగారు ఆభరణాలను అపహరించాడు. లాకర్‌లోని బంగారు ఆభరణాలన్నింటినీ దొంగిలించి దర్జాగా బటయకు వెళ్లిపోవడాన్ని సీసీటీవీల్లో రికార్డు అయ్యింది. బంగారు నగల షోరూమ్ యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ ప్రారంభించిన పోలీసులు దొంగతనం చేసిన నిందితుడు అదే జ్యువెలరీ షాపులోని పని చేసే సిబ్బంది సాయం తీసుకుని ఉండే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)