డీజీ ఆనంద్‌ పేరుతో ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో నకిలీ ఖాతాలు

Telugu Lo Computer
0


తెలంగాణ ఏసీబీ డీజీ సీవీ ఆనంద్‌ పేరుతో సైబర్‌ నేరగాళ్లు ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో రెండు ఫేక్‌ ఖాతాలు తెరిచారు. ఈ విషయాన్ని గుర్తించిన ఆయన సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. అవినీతి అధికారులపై ఇటీవల ఏసీబీ విస్తృతంగా దాడులు చేస్తున్నది. ఈ క్రమంలోనే రెండు ఖాతాలు నకిలీవి సోషల్‌మీడియాలో దర్శనమివ్వడంతో ఏసీబీ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. నకిలీ ఖాతాలను సోషల్‌మీడియా నుంచి తొలగించినట్టు సైబర్‌ క్రైమ్స్‌ ఏసీపీ శివమారుతి తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)