RIP అని స్టేటస్ పెట్టి ఆత్మహత్య చేసుకున్న యువకుడు !

Telugu Lo Computer
0


కేరళకు కొచికి సమీపంలోని ఆలువాకు చెందిన అజ్మల్ షరీఫ్ శుక్రవారం సాయంత్రం 6:30 గంటలకు ఆత్మహత్యకు పాల్పడ్డట్లు గుర్తించారు. ఇంట్లోని తన వ్యక్తిగత గదిలో ఉరి వేసుకుని మరణించాడు. అంతకు ముందు ఇన్‭ స్టాగ్రామ్‭ లో తన ఫొటోపై 'రిప్ అజ్మల్ షరీఫ్' అని పోస్ట్ పెట్టాడు. మంచి ఉద్యోగం సంపాదించలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అజ్మల్ కు ఇన్‭ స్టాగ్రామ్‭ లో 14 వేలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఆత్మహత్య నిర్ణయం తీసుకునే ముందు ఇన్ ‭స్టాగ్రామ్‭ లో  ఒక పోస్ట్ పెట్టాడు. తన ఫొటోపై 'రిప్ అజ్మల్ షరీఫ్' అని రాసిన ఫొటోను షేర్ చేశాడు. అందులో 1995-2013 అని కూడా ఉంది. అంటే అతను పుట్టిన ఏడాదితో పాటు ఆత్మహత్య చేసుకునే ఏడాదిని కూడా ముందుగానే రాశాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)