ముగిసిన అఖిలపక్ష సమావేశం !

Telugu Lo Computer
0


సోమవారం నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో పార్లమెంటు లైబ్రరీ భవన్‌లో శనివారం అఖిలపక్ష సమావేశం జరిగింది. కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నేతృత్వంలో జరిగిన  అఖిలపక్ష సమావేశానికి వివిధ రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లు హాజరయ్యారు. పొగ మంచు కారణంగా విమానాల దారి మళ్లింపుతో వైసీపీ, బీఆర్ఎస్ నేతలు హాజరు కాలేకపోయారు. టీడీపీ నుంచి రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ హాజరయ్యారు. ఈ సమావేశాల్లో ఎన్నికల కమిషనర్ల నియామకం బిల్లు, ఐపీసీ, సీఆర్పీసీ చట్టాల స్థానంలో తెచ్చే మూడు నేర శిక్షాస్మృతి బిల్లులతో పాటు మరికొన్ని ముఖ్యమైన బిల్లులను కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సభ సజావుగా సాగేలా, బిల్లుల ఆమోదానికి సహకారించాలని పార్టీల నేతలను ఈ సందర్భంగా ప్రభుత్వం కోరింది. కాగా పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 4 నుంచి 22 వరకు కొనసాగనున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)